చెన్నారావుపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రజా పాలన వేడుకలు

చెన్నారావుపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ప్రజా పాలన వేడుకలు ​చెన్నారావుపేట సెప్టెంబర్ 17 ప్రజావాణి స్వేచ్ఛాయుత పాలన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగఫలమే నేటి ప్రజా పాలన అని తహసిల్దార్ మహమ్మద్ అలీ అన్నారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సుదీర్ఘ పోరాటాల వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగాలు ఉన్నాయని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులని, వారికి పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే రెవెన్యూ...