📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని విమర్శిస్తే నాలుక కోస్తాం,దళిత సంఘ నాయకుల...

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని విమర్శిస్తే నాలుక కోస్తాం,దళిత సంఘ నాయకుల ఘాటు విమర్శ

📰 Generate e-Paper Clip

బద్వేల్. సెప్టెంబర్ 17 ప్రజావాణి భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బద్వేల్ తాలూకా సీనియర్ దళిత నాయకులు బత్తలకూరి కేశవయ్య, కడప జిల్లా అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ గురించి కొనియాడుతుంటే హమారా ప్రసాద్ ఆయనను కించపరిచే విధంగా పుస్తకాలు రాస్తున్నాం అనడం హమారా ప్రసాద్కు తగదన్నారు. హమారా ప్రసాద్ కూడా దళితుడే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఆయన కూడా అన్ని వసతులు అనుభవిస్తున్నారని అటువంటి వ్యక్తి అంబేద్కర్ను కించపరిచే విధంగా కించపరుస్తూ పుస్తకాలు రాయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించకపోతే బడుగు బలహీన వర్గాల స్థితిగతులు ఎలా ఉండేదో ఒకసారి వెనక్కి తిరిగి చూడమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన రిజర్వేషన్లు పొందే విధంగా ఆయన రూపొందించిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయని అటువంటి ఆర్టికల్స్ ప్రకారము హమారా ప్రసాద్ కూడా పొందుతున్నారన్నారు. హమారా ప్రసాద్ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దళిత సంఘాలు కుల సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నారని, నీవు నిజమైన దళితుడు అయితే అంబేద్కర్ గురించి పొగడాలే గాని అవమానించరాదని అన్నారు. హమారా ప్రసాద్ పై రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యమం కెరటాల లేస్తుందని నీ పై కేసులు పెట్టుటకు అందరూ సన్నద్ధ మవుతున్నారని ఇప్పటికైనా గ్రహించి దళిత వర్గానికి క్షమాపణ చెప్పాలని ,ముఖ్యంగా అంబేద్కర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలని హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.