📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్

కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 15,
ప్రజావాణి:
డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే,
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న
నేరడ గ్రామానికి చెందిన ముగ్గురు కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన మడూరి వీరభద్రం గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయిన మడూరి వీరభద్రంను రుద్రారపు శ్రీనివాస్, చందు నాగన్న పార్టీ ఆదేశాలను ధిక్కరించి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ తెలియకుండా తిరిగి పార్టీలో చేర్చుకున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు మడూరి వీరభద్రం, రుద్రారపు శ్రీనివాస్, చందు నాగన్న ముగ్గురిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తప్పవని బాలగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.