📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఓడీఎఫ్‌ కాలనీలో బాల గణనాథుడి వైభవం

ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణనాథుడి వైభవం

📰 Generate e-Paper Clip

*కొలువుదీరిన బాల గణపయ్యకు ఘనంగా పూజలు..

*చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ..

*ప్రతిభావంతులకు షీల్డ్లు అందజేసిన గణేష్ ఉత్సవ కమిటీ

అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 15 (ప్రజావాణి): అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాల గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన కాలనీవాసులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గణపయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాలనీ పండుగ శోభను సంతరించుకుంది. గణనాథుడి నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా చిన్నారుల కోసం నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిషిత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ కళా ప్రతిభను చాటుకున్నారు. లయబద్ధమైన నృత్యాలతో చిన్నారులు అలరించగా.. కాలనీవాసులు చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన చిన్నారులకు షీల్డులు అందజేసి ప్రోత్సహించారు.
ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న బాల గణపతి ఉత్సవాలు ఈసారి కూడా ఓడీఎఫ్‌ కాలనీలో భక్తి, ఆనందోత్సాహాలను నింపాయి. బాల గణనాథుడి సన్నిధిలో చిన్నారుల సాంస్కృతిక సందడి వేడుకలకు మరింత వన్నె తెచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.