ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణనాథుడి వైభవం

*కొలువుదీరిన బాల గణపయ్యకు ఘనంగా పూజలు.. *చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ.. *ప్రతిభావంతులకు షీల్డ్లు అందజేసిన గణేష్ ఉత్సవ కమిటీ అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 15 (ప్రజావాణి): అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాల గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన కాలనీవాసులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గణపయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాలనీ పండుగ శోభను సంతరించుకుంది. గణనాథుడి నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. వినాయక చవితి వేడుకల్లో భాగంగా చిన్నారుల...