📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMedchal-Malkajgiriమనువాదాన్ని ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి... సెక్యులర్‌ శక్తులను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు... ఘట్కేసర్‌లో...

మనువాదాన్ని ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి… సెక్యులర్‌ శక్తులను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు… ఘట్కేసర్‌లో సీతారాం ఏచూరికి సీపీఎం ఘన నివాళి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): మనువాద, మతోన్మాద విధానాలను ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సీతారాం ఏచూరి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తారని సీపీఎం ఘట్కేసర్‌ మండల కార్యదర్శి ఎన్‌.సబిత అన్నారు. సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎన్‌.సబిత మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే విప్లవ భావాల వైపు ఆకర్షితుడైన ఏచూరి తుదిశ్వాస వరకు నిబద్ధత కలిగిన మార్క్సిస్టుగా, కార్మికవర్గ పక్షపాతిగా పనిచేశారని అన్నారు. మతోన్మాద శక్తులను ఎదుర్కొంటూ అభ్యుదయ, లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏచూరి పోరాడారని గుర్తుచేశారు. సీపీఎం అంతర్జాతీయ విభాగానికి నాయకత్వం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వర్గ పోరాటాలు, కమ్యూనిస్టు ఉద్యమాల గురించి ప్రజలకు సరళమైన భాషలో వివరించేవారని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాలను విశ్లేషించి పేదలు, కార్మికులు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో ఆయనకు ప్రత్యేకమైన సామర్థ్యం ఉందన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, ఇండియా కూటమి ఏర్పాటులో ఏచూరి కీలక భూమిక పోషించారని సబిత పేర్కొన్నారు. దేశంలోని పీడిత, అణగారిన వర్గాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. నేటి విద్యార్థి, యువత సీతారాం ఏచూరి జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు అలివేల, చల్లగొండ అరుణ, బి.సునీత, దేవి, పార్వతమ్మ, పి.కుమారి, కే.అనసూయ, శాంతాబాయి, వి.రాములు, గాయత్రి, శివం, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.