మనువాదాన్ని ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి… సెక్యులర్‌ శక్తులను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు… ఘట్కేసర్‌లో సీతారాం ఏచూరికి సీపీఎం ఘన నివాళి

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): మనువాద, మతోన్మాద విధానాలను ప్రతిఘటించిన మార్క్సిస్టు మేధావి, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సీతారాం ఏచూరి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తారని సీపీఎం ఘట్కేసర్‌ మండల కార్యదర్శి ఎన్‌.సబిత అన్నారు. సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్‌.సబిత మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే విప్లవ భావాల వైపు...