📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సజ్జల రామకృష్ణారెడ్డితో బద్వేల్ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి భేటీ.. నియోజకవర్గ రాజకీయాలపై...

సజ్జల రామకృష్ణారెడ్డితో బద్వేల్ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి భేటీ.. నియోజకవర్గ రాజకీయాలపై కీలక చర్చ!

📰 Generate e-Paper Clip

తాడేపల్లి బద్వేల్:సెప్టెంబర్ 11 ప్రజావాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ని బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ఈరోజు తాడేపల్లిలోని సజ్జల రామకృష్ణారెడ్డి,నివాసంలో ఈ భేటీ జరిగింది.బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ

ఈ సమావేశంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాబలాలు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ పరిస్థితి, మరియు స్థానిక ప్రజల్లో ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సజ్జల దృష్టికి తీసుకెళ్లారు.

కార్యకర్తలకు అండగా ఉండాలి: సజ్జల దిశా నిర్దేశం

నాయకులతో చర్చించిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ,బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఏ చిన్న కష్టం వచ్చినా అండగా నిలబడాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. నాయకులందరూ సమిష్టిగా,సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.నిరంతరం ప్రజల్లో ఉంటూ,వారి సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని దిశా నిర్దేశం చేశారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం: నల్లేరు విశ్వనాథ రెడ్డి

భేటీ అనంతరం శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం మరియు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఆదేశాల మేరకు బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పార్టీ జెండాను ఎగురవేస్తూ, క్షేత్రస్థాయి నుండి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తామన్నారు.తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు.ఈ మర్యాదపూర్వక సమావేశంలో నల్లేరు విశ్వనాథ రెడ్డి,తో పాటు బద్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి,ని కలిసిన వారిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కీలక నేతలు ఉండటంతో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.