పెద్దమల్లారెడ్డికి నాలుగు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
పెద్దమల్లారెడ్డి, సెప్టెంబర్ 10 ( ప్రజావాణి )
బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు వివిధ విభాగాల్లో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
పెద్దమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ప్రసూన దేవి బిక్కనూర్ మండల ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అదే పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అర్చన మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్గా ఎంపికయ్యారు.
అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి మండల ఉత్తమ ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. పెద్దమల్లారెడ్డి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నలుగురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి, విద్యారంగానికి వారు చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి ఉపసర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్, నట లింగం, బుడ్డ సుగుణ, సత్తయ్య, గీజివెల్లి మాధవరెడ్డి, కంతి వసంత, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

