పెద్దమల్లారెడ్డికి నాలుగు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
పెద్దమల్లారెడ్డికి నాలుగు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పెద్దమల్లారెడ్డి, సెప్టెంబర్ 10 ( ప్రజావాణి ) బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు వివిధ విభాగాల్లో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పెద్దమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ప్రసూన దేవి బిక్కనూర్ మండల ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అదే పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అర్చన మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు....