📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetజానకీనగర్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమం

జానకీనగర్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జానకీనగర్‌లో ఘనంగా వనభోజన కార్యక్రమం
చిలుకూరు మండలం జానకీనగర్ గ్రామంలో వనభోజన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పిల్లలు, యువత, మహిళలు, పెద్దలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రకృతి ఒడిలో వంటలు చేసుకుని సామూహికంగా భోజనాలు చేశారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుషా రవికుమార్, మండల ఎస్టీ సెల్ నాయకులు రాజేష్, ధర్మ, సురేష్, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులందరూ కలిసి వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.