📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు - బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ నారిశెట్టి...

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు – బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ 

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల: సెప్టెంబర్ 8 ప్రజావాణి ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించి, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి మంచి లాభాలు పొందాలని బద్వేల్  ఛైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ పిలుపునిచ్చారు.పోరుమామిళ్ల మండలం నర్సింగపల్లెలోని మొపూరి చిన్నయ్యకు చెందిన ఆయిల్‌పామ్ క్షేత్రంలో ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసుల రెడ్డి ఆద్వర్యం లో వైఎస్సార్ కడప జిల్లా, రియో ఆగ్రో ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగు, విస్తరణ అవకాశాలు, రైతులకు లభించే ప్రభుత్వ రాయితీలు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ అంశాలపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రజ మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం , ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు అందిస్తున్న రాయితీలు, సాంకేతిక సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన పద్ధతుల్లో సాగు చేస్తే ఆయిల్‌పామ్ రైతులకు దీర్ఘకాలికంగా మంచి ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని తెలిపారు.ఈ సదస్సులో జిల్లా ఉద్యాన శాఖ అధికారి హరిప్రసాద్, పోరుమామిళ్ల ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి, వ్యవసాయ సహాయకురాలు సుధ, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి, కూటమి నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే కోరమండల్, రియో ఆగ్రో ఇండస్ట్రీస్ సిబ్బంది పాల్గొని ఆయిల్‌పామ్ సాగు విధానాలు, పంట యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.