నంగునూరు, సెప్టెంబర్ 8 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తన్నీరు హరీష్‌రావు, తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నంగునూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనరాజు నాగరాజు, రాంపూర్ మగ్దంపూర్ మాజీ ఎంపిటిసి ఎనగందుల నితిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అచ్చిన సత్తయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు, తాతా మధుసూదన్‌ల ఫ్లెక్సీని దహనం చేసి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాజకీయ విభేదాలను వ్యక్తిగత విమర్శలకు దారితీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరబోయిన సంపత్, చెలికాని యాదగిరి, బాగు శ్రీకాంత్ యాదవ్, దాసరి కిషన్, రాగుల కనకయ్య, తుపాకుల శ్రీనివాస్, నాగరాజుపల్లి బాలయ్య, సందబోయిన తిరుపతి, మొతకని కనకయ్య, మ్యాక రజినీకాంత్, పంగ శేఖర్, ఘనపురం భాను, ఆరేపల్లి సురేష్, పాకాల భాస్కర్, నర్సింలు గౌడ్, సుంకరి శేఖర్, మహబూబ్, మహేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

