భక్తుల రద్దీతో కిటకిటలాడిన సిద్ధరామేశ్వర ఆలయం
-శ్రావణ మాసం చివరి సోమవారంతో అధిక సంఖ్యలో భక్తులకు రాక
భిక్కనూరు సెప్టెంబర్ 07 ( ప్రజావాణి):
భిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రసిద్ధిగాంచిన క్షైవకక్షేత్రం దక్షిణ కాశీగా కొలిచే శ్రీసిద్ధరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రంలో శ్రావణమాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు వివిధ జిల్లాల నుండి,ఇతర రాష్ట్రాల నుండి వేకువ జామున దేవాలయంకు చేరుకొని మూలబావి నీటితో స్నానాలు ఆచరించి,స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలతో దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు,భక్తుల రాకతో దేవాలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది,ఈక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొడకండ్ల రామగిరిశర్మ,కొడకండ్ల నవీన్ కుమార్ శర్మ,న్యాలకంటి రాజేశ్వర శర్మ వారు ప్రత్యేక అభిషేకాలు,ప్రత్యేక సత్యనారాయణ స్వామి వ్రతాలు,స్వామి వారికి కోడిమొక్కులను భక్తులు చెల్లించుకుని,భక్తుల సహకారంతో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ మంచి కట్ల ముత్తయ్య వారి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు,భక్తుల సౌకర్యార్థం దేవాలయ పున:నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి,కమిటీసభ్యుల సహకారంతో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు,భక్తుల రాకతో దేవాలయం ప్రాంగణం పండగ వాతావరణంతో సందడిగా మారింది, స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు సంతోషని వ్యక్తపరిచారు.



