📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddyపెద్దమల్లారెడ్డిలో యూరియా కష్టాలు.. యాప్‌తో తప్పనితిప్పలు!

పెద్దమల్లారెడ్డిలో యూరియా కష్టాలు.. యాప్‌తో తప్పనితిప్పలు!

📰 Generate e-Paper Clip

పెద్దమల్లారెడ్డిలో యూరియా కష్టాలు.. యాప్‌తో తప్పనితిప్పలు!

— యూరియా కోసం రైతుల పడిగాపులు.. “యాప్‌ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు” అంటూ ఆవేదన

భిక్కనూరు, సెప్టెంబర్ 07 ( ప్రజావాణి ):

భిక్కనూర్ మండలంపెద్దమల్లారెడ్డి గ్రామంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, తాజాగా యాప్‌ పేరుతో రైతులను మరింత తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటలకు కీలకమైన సమయంలో యూరియా కోసం రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి నెలకొంది.

యూరియా కోసం రైతులు సంబంధిత అధికారులను సంప్రదించగా “సర్వర్‌ డౌన్‌ అయింది” అంటూ సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపామని, అయితే అక్కడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

* యాప్‌ పేరుతో రైతులకు తిప్పలు!

పంటకు అవసరమైన సమయంలో యూరియా అందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు యూరియా కోసం పడిగాపులు, మరోవైపు సర్వర్‌ సమస్య అంటూ అధికారులు చెప్పడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడుతున్నారు.

“యూరియా కావాలంటే యాప్‌.. యాప్‌ పనిచేయకపోతే సర్వర్‌ డౌన్‌.. మరి మా పంట పరిస్థితి ఏంటి?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. యాప్‌ పేరుతో తమను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* పంట సమయం దాటితే బాధ్యత ఎవరిది?

రైతులకు సకాలంలో యూరియా అందకపోతే పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి యూరియా పంపిణీని వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.

* అధికారుల వివరణ

ఈ విషయంపై అధికారులను సంప్రదించగా, “పెద్దమల్లారెడ్డిలో నెలకొన్న ఈ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యను ప్రభుత్వానికి కూడా తెలియజేశాం. త్వరలోనే సర్వర్‌, యాప్‌కు సంబంధించిన ఇబ్బందులు పరిష్కారమై రైతులకు యూరియా అందుబాటులోకి వస్తుంది” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.