ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలి
తంగళ్లపల్లి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం సమావేశం
తంగళ్లపల్లి ప్రజావాణి సెప్టెంబర్ 17 ముదిరాజులను ప్రస్తుతం ఉన్న బీసీ (డి) నుంచి బీసీ (ఏ )లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయాలని తంగళ్లపల్లి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సభకు పెద్ద సంఖ్యలో ముదిరాజులు తరలిరావాలని కోరారు.ఈ సమావేశానికి జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పబ్బాల దేవరాజు, జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ కూనవేని పరుశరాములు, తంగళ్లపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రంగు అంజయ్యతో పాటు ముదిరాజ్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

