పోచారం, సెప్టెంబర్ 2: పోచారం 8వ డివిజన్ పరిధిలో హైవే సీపీఆర్‌ఐ నుంచి నారపల్లి ప్రభుత్వ పాఠశాల వరకు ఐమాక్స్ లైట్లు పనిచేయక స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ సమస్యను పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో, తోటకూర అజయ్ యాదవ్తో కలిసి మాజీ మేయర్ రాధిక గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సహకారంతో సీపీఆర్‌ఐ నుంచి నారపల్లి ప్రభుత్వ పాఠశాల వరకు పవర్ కేబుల్ ఏర్పాటు పనులను గురువారం ప్రారంభించారు.
ఈ పనులను ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్ పర్యవేక్షించారు. కేబుల్ పనులు పూర్తయిన అనంతరం ఐమాక్స్ లైట్లు పూర్తిస్థాయిలో వెలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.


