📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో “ది రైటింగ్ స్టార్ అవార్డు–2026” ప్రదానం

వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో “ది రైటింగ్ స్టార్ అవార్డు–2026” ప్రదానం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల: సెప్టెంబర్ 01 ప్రజావాణి  థెరెసా ఫౌండేషన్, పోరుమామిళ్ల వారి ఆధ్వర్యంలో వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో,ది రైటింగ్ స్టార్ అవార్డు–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.విద్యార్థుల్లో అందమైన దస్తూరిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6,7,8,10వ తరగతులకు ఒక్కొక్క విద్యార్థికి, 9వ తరగతికి ఇద్దరు విద్యార్థులకు కలిపి మొత్తం ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ మరియు మెమెంటో లను కూడా అందించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కో-చైర్మన్ చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, ట్రెజరర్ ప్రజ్వలారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు రాజానంద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు దస్తూరి ఎంతో ముఖ్యమని అన్నారు. చిన్నతనం నుంచే అక్షరాలను అందంగా, స్పష్టంగా రాయడం అలవాటు చేసుకుంటే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల్లో దస్తూరి పట్ల ఆసక్తిని పెంపొందించి, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉందని పేర్కొన్నారు. ఈ ఆరుగురు విద్యార్థులకు సర్టిఫికెట్‌తో పాటు మెమెంటో అందించడం వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహంగా భావిస్తున్నామని తెలిపారు.రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు అందమైన దస్తూరితో *ది రైటింగ్ స్టార్ అవార్డు*ను అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ అవార్డు కార్యక్రమం ద్వారా విద్యార్థులందరిలో ఆరోగ్యకరమైన పోటీ, సృజనాత్మకత మరియు రాతపట్ల ఆసక్తి పెరగాలని పిలుపునిచ్చారు.తమ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ ది రైటింగ్ స్టార్ అవార్డు–2026ను అందించిన మదర్ థెరెసా ఫౌండేషన్ ప్రతినిధులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత ఉపాధ్యాయులు జయరాం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.