వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో “ది రైటింగ్ స్టార్ అవార్డు–2026” ప్రదానం
పోరుమామిళ్ల: సెప్టెంబర్ 01 ప్రజావాణి థెరెసా ఫౌండేషన్, పోరుమామిళ్ల వారి ఆధ్వర్యంలో వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో,ది రైటింగ్ స్టార్ అవార్డు–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.విద్యార్థుల్లో అందమైన దస్తూరిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6,7,8,10వ తరగతులకు ఒక్కొక్క విద్యార్థికి, 9వ తరగతికి ఇద్దరు విద్యార్థులకు కలిపి మొత్తం ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. అవార్డుతో పాటు సర్టిఫికెట్ మరియు మెమెంటో లను కూడా అందించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కో-చైర్మన్ చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, ట్రెజరర్ ప్రజ్వలారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు...