📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaరైతులకు పప్పు ధాన్యాలపై అవగాహన సదస్సు - పి. మల్లేష్

రైతులకు పప్పు ధాన్యాలపై అవగాహన సదస్సు – పి. మల్లేష్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామం లో పప్పు ధాన్యాల పైన మరియు కంది పంటలు వచ్చే చీడపీడల యొక్క సమగ్ర చీడపీడల నివారణ చర్యల అంశం పైన ఆత్మ క్షేత్ర ప్రదర్శన రూపంలో మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ రైతులకు అవగాహన కల్పించారు. ఎప్పుడూ పత్తి, వరి కాకుండా పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల భూమి యొక్క సారము కాపాడుకోవడం సాధ్యపడుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కంది పంట మోకాలు ఎత్తు ఉందని. ఇప్పుడు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఉంటుందని దీని నివారణకు మొదటి దఫలో వేప నూనె@5% 10 రోజుల తర్వాత పురుగులు తగ్గనట్లయితే ఎసిఫేట్ @250 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకుంటే పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా నీటి సదుపాయం ఉన్న రైతులు నీటి తడులు ఇవ్వాలని కోరారు. విస్తరణాధికారి ఎమ్ జగన్, రైతులు జక్కలి ప్రవీణ్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.