📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసర్పంచ్ పెద్దమ్మల సత్యంను పరామర్శించిన వంగ రాజేశ్వర్ రెడ్డి యశోద ఆసుపత్రిలో వైద్యులను అడిగి...

సర్పంచ్ పెద్దమ్మల సత్యంను పరామర్శించిన వంగ రాజేశ్వర్ రెడ్డి యశోద ఆసుపత్రిలో వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నంగునూరు, ఆగస్టు 31 (ప్రజావాణి):

నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామ సర్పంచ్ పెద్దమ్మల సత్యంకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న పెద్దమ్మల సత్యంను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యులను కలిసి సత్యంకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం సత్యం కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని సూచించారు.

పెద్దమ్మల సత్యం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. సత్యం కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. సత్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.