పోరుమామిళ్ల ఆగస్టు 31 ప్రజావాణి మండలంలో అక్రమ మట్టి మాఫియాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు.మండల పరిధిలోని రంగసముద్ద్ర0 పంచాయతీలో గల సర్వే నంబర్ 118 లో ఎటువంటి అనుమతులు లేకుండా,నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్నమట్టి తోలకాలను అధికారులు సోమవారం అడ్డుకున్నారు.నిందితుల నుంచి మట్టితో లోడ్ చేసిన నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.స్థానికుల నుంచి అందిన ముందస్తు సమాచారం మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ ఐ) సుధాకర్ రెడ్డి,విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఓభయ్య తమ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.రంగసముద్రం పంచాయతీ సర్వే నంబర్ 118 పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి ఎలాంటి మైనింగ్ అనుమతులు కానీ, చలానాలు కానీ లేకుండా కొందరు వ్యక్తులు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఏ రకమైన ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపకపోవడంతో, అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అక్కడికక్కడే పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం వాటిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు: ఆర్ ఐ సుధాకర్ రెడ్డి హెచ్చరిక
ఈ సందర్భంగా ఆర్ ఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సహజ సంపదను దోపిడీ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రంగసముద్రం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా మట్టి,ఇసుక లేదా ఇతర ఖనిజాల తవ్వకాలకు పాల్పడితే వారిపై మైనింగ్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం.వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం”అని ఆయన హెచ్చరించారు.ఈ దాడుల్లో వీఆర్వో ఓభయ్యతో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.ప్రభుత్వ భూములు మరియు వాగుల పరిరక్షణ కోసం రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవడంపై రంగసముద్రం పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరంతర నిఘా కొనసాగించాలని కోరుతున్నారు.
పోరుమామిళ్లలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలింపు.. 4 ట్రాక్టర్లు సీజ్
RELATED ARTICLES

