📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వృద్ధుడి హత్య కేసు ఛేదింపు: కాశినాయన నాయబ్ రసూల్‌కు డీఎస్పీ క్యాష్ రివార్డు

వృద్ధుడి హత్య కేసు ఛేదింపు: కాశినాయన నాయబ్ రసూల్‌కు డీఎస్పీ క్యాష్ రివార్డు

📰 Generate e-Paper Clip

కాశినాయన,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును అత్యంత వేగంగా,చాకచక్యంగా ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన కాశినాయన పోలీస్ స్టేషన్ సిబ్బంది నాయబ్ రసూల్ ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డు (నగదు పురస్కారం) అందజేశారు.
చాకచక్యంగా నిందితుల అరెస్ట్
ఎకరా 30 సెంట్ల భూవివాదం కారణంగా,రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో నాయబ్ రసూల్  కీలక పాత్ర పోషించారు.నిందితుల కదలికలపై నిఘా ఉంచడం, క్షేత్రస్థాయి ఆధారాలను సేకరించడంలో దర్యాప్తు బృందానికి ఎంతో ప్రతిభావంతమైన సహకారాన్ని అందించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంలో మరియు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకోవడంలో ఆయన ఎంతో శ్రద్ధతో, కష్టపడి పనిచేశారు.
డీఎస్పీ ప్రశంసలు
నాయబ్ రసూల్ విధి నిర్వహణలో చూపిన అంకితభావం, సమయస్ఫూర్తిని డీఎస్పీ రాజేంద్రప్రసాద్  కొనియాడారు.ఈ సందర్భంగా నాయబ్ రసూల్ కి డీఎస్పీ  చేతుల మీదుగా క్యాష్ రివార్డు మరియు అభినందన పత్రాన్ని అందజేశారు. క్లిష్టమైన కేసులను ఛేదించడంలో ఇలాంటి సిబ్బంది చొరవ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతుందని డీఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.