ఘట్కేసర్, ఆగస్టు 27: ఘట్కేసర్ మండల్ పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బిషప్ విల్సన్ సింగం సందేశం అందించగా, మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ శంకర్ లూకు, రాష్ట్ర క్రైస్తవ నాయకులు శ్రీ గడ్డం సాల్మన్, శ్రీ మోజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీ వేముల మహేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఇటుకల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కర్రె రాజేష్, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్ర మాధవి రాజు, శ్రీ భోజ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నర్సింగ్ ముదిరాజ్ తదితర నాయకులు, పాస్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ క్రైస్తవ సమాధుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా రూ.75 లక్షల నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. క్రైస్తవ సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
నూతన కార్యవర్గ సభ్యులను నాయకులు అభినందిస్తూ క్రైస్తవ సమాజ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గం: అధ్యక్షులుగా రెవ. జాన్ మార్క్ భూపతి, ఉపాధ్యక్షులుగా వి. శ్రీనివాస్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా దేశభక్తిని రాజేష్, ప్రధాన కార్యదర్శిగా రెవరెండ్ ఈ. మార్టిన్, కోశాధికారిగా పాస్టర్ పి. సునీల్ కుమార్ ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గానికి పలువురు పాస్టర్లు, బిషప్లు, క్రైస్తవ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.


