పోచారం: కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలను బలోపేతం చేసే లక్ష్యంతో పోచారం డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు నూతన అధ్యక్షులను నియమించారు. నూతన అధ్యక్షులకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణారెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతనంగా నియమితులైన గ్రామ శాఖ అధ్యక్షుల్లో కాచవాణి సింగారానికి వర్కల మహేష్ గౌడ్, ప్రతాప్ సింగారానికి గ్యారా సురేష్, చౌదరిగూడకు మంచాల సుధాకర్, కొర్రెములకు బల్లెం మహేష్, వెంకటాపురానికి నీరుడి వెంకటేష్, నారపల్లికి ఎండి నిజాం ఖాన్, పోచారానికి పాలకూరి నరేష్ గౌడ్, అన్నోజిగూడకు పడమటి విజయ్ రెడ్డి, రాజీవ్ గృహకల్ప కాలనీకి గంధమల్ల రమేష్ గౌడ్, యమ్నంపేట్‌కు పొలగొని సహదేవ్ గౌడ్, ఇస్మాయిల్ ఖాన్ గూడకు కొండకల్లి లింగంను నియమించారు.
నూతన అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

