📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేకంలో ఘనంగా పాల్గొన్న ఆనగంటి హరికృష్ణ

శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేకంలో ఘనంగా పాల్గొన్న ఆనగంటి హరికృష్ణ

📰 Generate e-Paper Clip

శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేకంలో ఘనంగా పాల్గొన్న ఆనగంటి హరికృష్ణ

వింజం పంచాయతీ, VLR పల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా కుంభాభిషేకం – ఆలయానికి రూ.1 లక్ష విరాళం
పెనుమారు  (ప్రజావాణి ప్రతినిధి) ఆగస్టు 17

గంగాధర నెల్లూరు మండలం: వింజం పంచాయతీ పరిధిలోని VLR పల్లి గ్రామంలో శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గౌ. శ్రీ డా. ఆనగంటి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ గుర్రప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించిన గౌ. శ్రీమతి డా. గుమ్మడి కుతూహలమ్మ గారి జ్ఞాపకార్థం, ఆమె తనయుడు డా. ఆనగంటి హరికృష్ణ శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.

ఆలయ అభివృద్ధికి విరాళం అందించడం పట్ల గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ డా. ఆనగంటి హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి ఆయన స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ మహా కుంభాభిషేక కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు వెల్కూరు బాబు రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ గుర్రప్ప స్వామి ఆలయ అభివృద్ధికి అండగా నిలిచిన డా. ఆనగంటి హరికృష్ణ సేవలను గ్రామస్థులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.