వేములపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ పండుగ బోనాల జాతర వేడుకలు
స్థానిక మండలం వేములపల్లి గ్రామంలోఆదివారం ముత్యాలమ్మ బోనాల జాతర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున హాజరై, బోనాలు ఎత్తి సందడి చేశారు.వేములపల్లి గ్రామంలో బోనాల పండుగను
మహిళలు,పెద్దలు యువకులు భక్తిశ్రద్ధలతో, ముత్యాలమ్మ, తల్లిని ఆరాధిస్తూ,కోడిపుంజులతో, కొబ్బరికాయలు పసుపు కుంకుమ లతో బోనాలను ఆమెకు నైవేద్యంగా సమర్పించారు. ఈ పండుగ సందర్భంలో గ్రామీణ మహిళా మణులంత, కలసి ఈ సంవత్సరం ముత్యాలమ్మ తల్లి కరుణించి, పాడి పంటలను కాపాడి, పిల్లాపాపలను చ
ల్లంగా చూసి, గ్రామీణ ప్రజలకు అష్ట ఐశ్వర్యాలను సుఖసంతోషాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకున్నారు. వర్షాలు కూడా బాగా కురిపించి పాడి పంటలను కాపాడాలని ముత్యాలమ్మ తల్లిని ఆరాధిస్తూ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుమ్మడవెల్లిరవి, వార్డు మెంబర్లు,మాజీ సర్పంచ్ పర్షయ్య, పంతం మ్సురేందర్,బాబు, మాజీ సిఏ పరిషయ్య సాలయ్య, మధు,నవిల ప్రవీణ్,శ్రీకాంత్ ఉప్పలయ్య,గ్రామీణ ప్రజలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

