📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaమరియానికేతన్ స్కూల్‌ లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మరియానికేతన్ స్కూల్‌ లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

నల్లగొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలోని మరియానికేతన్ స్కూల్‌లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాలు, త్రివర్ణ పతాకాలతో ప్రత్యేకంగా అలంకరించి దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రొఫెసర్ శౌరీ చిన్నాబాట్టిని ఎస్ డి బి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు త్రివర్ణ రంగుల దుస్తులు ధరించి, కొందరు సైనికుల వేషధారణలో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సమూహ విన్యాసాలు, దేశభక్తి నృత్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కార్యక్రమానికి హాజరైన వారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శౌరీ చిన్నాబాట్టిని ఎస్ డి బి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. దేశభక్తి నినాదాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో మరియానికేతన్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.