మరియానికేతన్ స్కూల్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: నల్లగొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలోని మరియానికేతన్ స్కూల్‌లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాలు, త్రివర్ణ పతాకాలతో ప్రత్యేకంగా అలంకరించి దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రొఫెసర్ శౌరీ చిన్నాబాట్టిని ఎస్ డి బి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య...