ఓటరు జాబితాల ప్రక్రియకు వేగం పెంచిన ప్రభుత్వ అధికారులు
సెప్టెంబర్ 21. ప్రజావాణిన్యూస్/సంగెం
సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎమ్మార్వో రాజకుమార్ ప్రత్యేక దృష్టి సారించారు ఆర్ ఐ శారద,నరేందర్,జిపి.ఓ.ఎస్. కిషోర్,సదానందం,రాజేందర్,శ్రావణ్,క్రాంతి,బి ఎల్ ఓ వెంకటేశ్వర్లు,వి.ఆర్.ఏ వేణు,నతీష్ సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాల పరిశీలన, సవరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు.ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.బూతుల్లో తమ తమ ఓటర్లను అప్రూవల్ కావడం కోసం మరల ఫోటో ఐడెంటి ప్రూఫ్స్ స్కాన్ చేయడం జరిగింది మీ ఓటు వస్తుంది లేని ఎడల మీకు ఓటు పోయే అవకాశం ఉన్నదని ఇన్ని రోజులు టైం ఇచ్చిన అశ్రద్ధ చేశారు ఈరోజు ఆఖరు రోజు కావడంతో అప్రమత్తమైన
గ్రామపంచాయతీ బిఎల్వోలు మండల రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాష్పాక సదయ్య, గ్రామ కార్యదర్శి శరత్ కుమార్,గ్రామ సిబ్బంది,వార్డు నెంబర్లు అందరు పాల్గొన్నారు.

