📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఘనంగా 80 వ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

ఘనంగా 80 వ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):

చండూర్ మండలం, మున్సిపాలిటీ లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చండూర్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో యాదగిరి, తహసిల్దార్ కార్యాలయం ముందర ఎమ్మార్వో రమాకాంత్ శర్మ, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శివకుమార్, హై స్కూల్ గ్రౌండ్లో ప్రధానోపాధ్యాయులు కోటీశ్వర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పాటల వెంకన్న, వివిధ ప్రవేట్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతరాజు శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐయితరాజు మల్లేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ జాతీయ జెండాలను ఎగురవేశారు. చామలపల్లి గ్రామంలో సర్పంచ్ ముదిగొండ ఆంజనేయులు, మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచులు విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపించి, జాతీయ జెండాలు ఎగురవేసి, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

Previous article
విద్యార్థుల దేశభక్తి నినాదాలతో మార్మోగిన పాఠశాల ప్రాంగణం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత రామాయంపేట, ఆగస్టు 15: రామాయంపేట మండలం క్యాట్రియల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణాన్ని జాతీయ పతాకాలతో, దేశభక్తి సందేశాలతో అలంకరించారు. ఉదయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు సమయానికి పాఠశాల ఆవరణకు చేరుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించిన అనంతరం విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణాన్ని మార్మోగించారు. దేశభక్తి చాటిన విద్యార్థులు వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. పలువురు విద్యార్థులు స్వాతంత్ర్య ఉద్యమం, జాతీయ నాయకుల పోరాటం, దేశ నిర్మాణంలో యువత పాత్ర తదితర అంశాలపై ప్రసంగించి ఆకట్టుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు, నినాదాలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. చిన్నారులు జాతీయ పతాకాలను చేతబట్టి ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం అంతా దేశభక్తి వాతావరణంతో నిండిపోయింది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ విద్యార్థులు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాప్రతినిధుల అభినందనలు ఈ కార్యక్రమానికి క్యాట్రియల్ గ్రామ సర్పంచ్ కొత్త శ్రవంతి గుత్తా, ఉపసర్పంచ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని తెలిపారు. నేటి తరం విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని వారు సూచించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రతిభా ప్రదర్శనల్లో ముందంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 500 క్రాసులు, పలు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా వారి ప్రతిభను వివిధ రంగాల్లో వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు బహుమతులు, ప్రోత్సాహకాలు దోహదపడతాయని తెలిపారు. చదువుతో పాటు సేవాభావం అవసరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గాలయ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించడంతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలను గౌరవిస్తూ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం విద్యార్థులు కొనసాగించాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి విద్యార్థి తన బాధ్యతను గుర్తించి కష్టపడి చదవడంతో పాటు సమాజం పట్ల సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి నినాదాలతో సందడి వేడుకల్లో విద్యార్థుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు జాతీయ పతాకాలను చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ సందడి చేశారు. కొందరు విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలాపనతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది. విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, గ్రామ ప్రజాప్రతినిధుల పాల్గొనడంతో వేడుకలు మరింత ఘనంగా సాగాయి. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వం, జాతీయ సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో క్యాట్రియల్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, విజయవంతంగా ముగిశాయి.
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.