ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన సిఐ పులి రమేష్.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి,జెండాకు వందనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది,సీఐ కార్యాలయ సిబ్బంది, పత్రికా విలేకరులు,సీనియర్ రిపోర్టర్లు,ఎల్కతుర్తి ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ పులి రమేష్,ఎస్సై నర్శింహరావు మాట్లాడుతూ,స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని తెలిపారు.
దేశ అభివృద్ధి,ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.యువత దేశభక్తి,క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు,దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ పోలీస్ సిబ్బంది,పత్రికా విలేకరులతో కలిసి మూడు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఎల్కతుర్తి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు,సీనియర్ జర్నలిస్టులు సీఐ పులి రమేష్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమం దేశభక్తి,జాతీయ స్ఫూర్తిని చాటేలా ఘనంగా జరిగింది.

