బద్వేల్,ఆగస్టు 15:ప్రజావాణి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్ స్వర్ణ వార్డులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, వార్డుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో ప్రముఖ నాయకులు సకినాల పకీరయ్య, రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజారెడ్డి, ఉమా కృష్ణ, మల్లయ్య, సుబ్బరాయుడు, ప్రసాదు, వెంకట్ రెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేడుకల అనంతరం ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బద్వేల్ నగర్ స్వర్ణ వార్డులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES

