పోరుమామిళ్ల ఆగస్టు 14 ప్రజావాణి అంబరాన్ని అంటిన విద్యార్థుల దేశభక్తి!అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరుమామిళ్ల శఖ ఆధ్వర్యంలో,భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రోజున అత్యంత వైభవంగా’తిరంగా ర్యాలీ’ నిర్వహించారు.ఈ కార్యక్రమం స్థానికంగా అద్భుతమైన స్పందనను సంతరించుకుంది.దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, నేటి యువతలో దేశభక్తిని మరియు జాతీయ భావాలను మరింత పెంపొందించే ఉద్దేశంతో ఈ భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థిని ,విద్యార్థులు, యువకులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచిన 80 మీటర్ల భారీ జాతీయ జెండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులందరూ జెండాను అత్యంత గౌరవప్రదంగా చేబూని,”భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అనే ప్రతిధ్వనులతో పట్టణ వీధులను హోరెత్తించారు.దేశభక్తి నినాదాలతో పోరుమామిళ్ల పట్టణమంతా దేశభక్తి వాతావరణంతో మార్మోగింది.ఈ సందర్భంగా నాయకుడు అభిలాష్ మాట్లాడుతూ… “స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని, దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి.రేపటి భారతదేశాన్ని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత నేటి యువతపై ఉంది” అని పిలుపునిచ్చారు.ఈ తిరంగా ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థికి, ఏబీవీపీ కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు మరియు మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర నాయకులు,బిజెపి రాష్ట్ర నాయకుడు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, సిఐ హేమ సుందర్ రావు,ఎంఈఓ ఓబులేసు,ఎంపీడీవో ఉపేంద్ర, ఏబీవీపీ నాయకులు చంద్ర,కార్తీక్,హర్ష,శివ,బ్రహ్మయ్,ముని,సతీష్,జైచంద్ర,రవీంద్ర,యాసిన్,రితీష్,దినేష్ మరియు వివిధ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో ఘనంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ తిరంగా ర్యాలీ.*
RELATED ARTICLES
