📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaసాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

*

ముస్తాబాద్, /ప్రజావాణి

ఆగస్టు 13: 2026–27 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలుర)లో తల్లిదండ్రుల నూతన కార్యవర్గ ఎన్నికలను గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ఎన్నికలకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. రాజలింగం, ఉపాధ్యక్షుడిగా పి. నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా బి. వరప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా బి. సుమన్, సంఘటనా కార్యదర్శిగా ఎస్. బాలకృష్ణ, కోశాధికారిగా డి. బాబు ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా బి. వెంకటేశ్వర్లు, ఎస్. దేవదాసు, ఎం. అంజయ్య, డి. సత్యనారాయణ, బి. సతీష్, ఎ. నరేష్ కుమార్ ఎన్నిక కాగా, సలహాదారులుగా కె. రమేష్, డి. ప్రభాకర్, బి. తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల ప్రగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధి కోసం తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఎన్నికల కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.