📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

టేకురుపేట పీహెచ్‌సీలో ఘోరం:?రాని ‘మొబైల్ వ్యాన్’..పడిపోతున్న సంతకాలు!

నిలదీసిన విలేకరులపై మెడికల్ ఆఫీసర్ మేరీ ఎలీషా  రుసరుసలు..

“నన్నే బ్లాక్‌మెయిల్ చేస్తారా?” అంటూ వీరంగం

మూడు రోజులకొకసారి రావాల్సిన వాహనం. కాగితాల్లో మాత్రం అంతా సవ్యమే! ఫార్మసిస్ట్ లీవ్ లెటర్ అడిగితే దాటవేత.ప్రజారోగ్యంతో చెలగాటంపై ఉన్నతాధికారులు స్పందించేనా?

కడప జిల్లా పోరుమామిళ్ల ప్రజావాణి:

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల దారి తప్పుతున్నాయి. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకురుపేట పరిధిలో మొబైల్ వ్యాన్ (మొబైల్ మెడికల్ యూనిట్) నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

వాహనం రాదు.. కానీ సంతకాలు, డేట్లు అవకతవక !

నిబంధనల ప్రకారం టేకురుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్పెక్ట్ డేట్ అయిపోయిన, మందులు రిటర్న్తితీసుకపోవడానికి  కి మూడు రోజులకు ఒకసారి మొబైల్ వ్యాన్ రావాల్సి ఉంది.వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఈ మొబైల్ వ్యాన్ టేకురుపేటకు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. వాహనం క్షేత్రస్థాయికి రాకపోయినప్పటికీ, టేకురుపేట పీహెచ్‌సీ లాగ్‌బుక్‌లలో మాత్రం వాహనం వచ్చినట్లు, సేవలు అందించినట్లు దొంగ సంతకాలు, తప్పుడు తేదీలు వేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాహనం తిరగకుండానే తిరిగినట్లు చూపిస్తూ భారీగా ఇంధనం, మెయింటెనెన్స్ నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఫార్మసిస్ట్ గురించి విలేకరు సెలవుపై .లీవ్ లెటర్ అడిగితే మెడికల్ ఆఫీసర్ మేరీ ఎలీషా  ఆగ్రహం!

ఇదే విషయమై పీహెచ్‌సీలో విచారించగా, పంపిణీ చేయాల్సిన ఫార్మసీ సిబ్బంది సెలవులు ఉన్నారు  దీనిపై అక్కడి మెడికల్ ఆఫీసర్‌ను వివరణ కోరగా, “ఫార్మసీలో పనిచేసే వ్యక్తి లీవ్ (సెలవు) పెట్టాడు” అని సమాధానం ఇచ్చారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకు హాజరు కానప్పుడు దానికి సంబంధించిన సెలవు పత్రం (Leave Letter) రికార్డుల్లో ఉండాలి. దీంతో పీహెచ్‌సీలో ఉన్న లీవ్ లెటర్‌ను చూపించాలని విలేకరులు సదరు మెడికల్ ఆఫీసర్‌ను వివరణ అడిగారు.

మీడియాపై మెడికల్ ఆఫీసర్ దౌర్జన్యం: “నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తారా?”

నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన మెడికల్ ఆఫీసర్, విలేకరుల ప్రశ్నలకు తీవ్ర అసహనానికి గురయ్యారు. లీవ్ లెటర్ చూపించాల్సింది పోయి, ఎదురుదాడికి దిగారు. “మీరు నన్ను లీవ్ లెటర్ అడగడానికి ఎవరు? నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?” అంటూ విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపు ధోరణికి దిగారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికే మెడికల్ ఆఫీసర్ మీడియాపై ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. సమాధానం చెప్పలేక మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మొబైల్ వ్యాన్ రాకపోవడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేస్తూ, నిధులు స్వాహా చేస్తున్న ఇలాంటి అధికారుల తీరుపై జిల్లా వైద్యాధికారులు (DM&HO) తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టేకురుపేట పీహెచ్‌సీలో జరుగుతున్న ఈ దొంగ సంతకాల ఉదంతంపై, విలేకరులను బెదిరించిన మెడికల్ ఆఫీసర్ ప్రవర్తనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టేకురుపేట గ్రామస్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.