ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
ప్రధానమంత్రికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష
ఎల్లంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట్ మున్సిపాలిటీ 24వ వార్డులో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 24వ వార్డు కౌన్సిలర్ అర్చనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా అర్చనా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవలో మరింతకాలం కొనసాగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రధాని చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ఆశీర్వాద దీపం వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ ప్రజల సంక్షేమం, దేశ ప్రగతి మరింత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

