📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్విధులు బహిష్కరించిన పంచాయతీ కార్మికులు, ఏఐటియుసి

విధులు బహిష్కరించిన పంచాయతీ కార్మికులు, ఏఐటియుసి

📰 Generate e-Paper Clip

14 నెలలు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇచ్చి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పీవీ రమణ అధికారులపై ఆగ్రహం చెందారు.15 నెలలు పెండింగ్లో ఉన్న పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు జీవనోపాధి ఎలా అని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు సివి రమణ,సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు సఫా,లు అధికారులు కల్లబొల్లి మాటలు చెప్పి,కాలయాపన చేసి పనులు చేయించుకునే శ్రద్ధ వారికి జీతాలు పెట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ప్రశ్నించారు అనంతరం వారు విలేకరులతో సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతం అకౌంట్ లో జమ కాకపోతే,గంటకు ఒకసారి అకౌంట్ ని చెక్ చేసుకుంటారు కానీ పంచాయతీ కార్మికులకు ఎనిమిది నెలలు, లైటర్లకు 14 నెలలు,వాటర్ సిబ్బందికి 12 నెలలు జీతాలు ఇవ్వకపోతే వారికి అంగట్లో సరుకులు ఇవ్వడం లేదు,పిల్లలకు ఫీజు కట్టలేదని బడికి రావద్దు అంటున్నారు.హాస్పటల్లోకి వెళ్లాలన్నా చేతిలో చిల్లి నయా పైసా లేకపోయి అధికారులు ఎప్పుడు జీతాలు ఇస్తారా అని.కాచుకొని ఉంటే,కార్మికులకు పెరిగిన ధరలు, వేతనాలు రాక వారి ఇబ్బందులు చెప్పాలంటే గుండెను పిండేసే విధంగా వారి బాధలు ఉండడం చాలా బాధాకరమన్నారు అలాగే ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి,ఈవో పిఆర్డి విన్సెంట్ బాబు,పంచాయతి సెక్రటరీ యశ్వంత్ వారి ధర్నా వద్దకు వచ్చి మాకు ఎన్ని పనులు ఉన్నా ప్రధానమైన సమస్య మీ జీతాల పైనే మేము అధికారులతో మాట్లాడి ఈనెల30 తేదీలోపు డబ్బులు అకౌంట్లో జమ చేసే బాధ్యత మాది అని చెప్పడంతో ఎవరికి కార్మికులు ఒప్పుకొని విధుల్లోకి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షుడు పేరయ్య,మండల సహాయ కార్యదర్శి కేశవ,పంచాయతీ యూనియన్ నాయకులు నాగేష్,విష్ణు,గురయ్యా,ఓబులమ్మ,శారద,అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.