📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఘనంగా తిరుపతిరెడ్డి నగర్ 12 వ వార్షికోత్సవం. నిరుపేదలకు ఇంటి పట్టాలుఇవ్వ కపోతే రిలేదీక్షలు:సిపిఐహెచ్చరిక

ఘనంగా తిరుపతిరెడ్డి నగర్ 12 వ వార్షికోత్సవం. నిరుపేదలకు ఇంటి పట్టాలుఇవ్వ కపోతే రిలేదీక్షలు:సిపిఐహెచ్చరిక

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల పట్టణంలోని రెడ్డి నగర్ 12వ వార్షికోత్సవవేడుకలు ఘనంగాజరిగాయి.ఈసందర్భంగా రంగసముద్రం పంచాయతీ పరిధిలోనిసర్వేనెంబర్1008/2A1 లో గత 11 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు రెవెన్యూఅధికారులుఇప్పటివరకు ఇంటి పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులువీరశేఖర్,ఏరియాకార్య దర్శి పిడుగు మస్తాన్ తీవ్రస్థాయి లో మండిపడ్డారు.​దశాబ్దకాలంగా.నివాసముంటున్నపేదలకురెవెన్యూఅధికారులుఎందుకుపట్టాలుఇవ్వడంలేదనివారునిలదీశారు.ఈ కాలనీకి వెంటనే మౌలిక వసతులు కల్పించాలని,నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ప్రాంతంలోని పేదలు ఎండకు,వానకు,గాలికి,చలికి తట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని,పిల్లలను బడికి పంపలేక చిన్నచిన్న దుకాణాల్లో,హోటళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరుచేయాలని,లేనిపక్షంలో రిలే దీక్షలు చేపడతామని రెవెన్యూఅధికారులనుహెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పి.వి.రమణ, మండల కార్యదర్శి రవికుమార్,సహాయ కార్యదర్శి కేశవ,సఫా,షాహిదా,పేరయ్య,విశ్వాసమ్మ,జ్యోతి, బాలమ్మ,రాబియమ్మ,బెల్లం బాషా,విష్ణు, శ్రీనివాసులు,రంగాచారి,చాంద్ బాషా తదితరులతోపాటు భారీ సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.