📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటా0

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటా0

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని,వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బద్వేల్ పట్టణంలో నియోజకవర్గ యువ నాయకులు,రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పి.రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ శ్రీ డి.సి.గోవింద రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ పాల్గొన్నారు.ముందుగా ఎన్జీవో కాలనీలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డివిగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం డీఎస్సీ అభ్యర్థులు,నిరుద్యోగ యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీగా బయలుదేరారు. అయితే ర్యాలీ ప్రారంభం నుంచే పోలీసులు భారీగా మోహరించి,అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాకుండా ర్యాలీని అడ్డుగోలుగా అడ్డుకోవడం తీవ్రంగా బాధాకరమని నాయకులు అన్నారు.శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు,నిరుద్యోగ యువతను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను అణిచివేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదని,డీఎస్సీ–2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరిగే వరకు,డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.