విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటా0
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని,వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బద్వేల్ పట్టణంలో నియోజకవర్గ యువ నాయకులు,రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పి.రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ శ్రీ డి.సి.గోవింద రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ పాల్గొన్నారు.ముందుగా ఎన్జీవో...