చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి
ప్రజావాణి శాయంపేట

మండలంలోని జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టులో జరిగింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన పల్లె బోయిన బిక్షపతి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చలి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు చేపలు పడుతూ ఉండగా చేపల కోసం వేసిన వలను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో పడిపోయి ఊపిరాడక మృతి చెందాడు తోటి మత్స్యకారులు మృతదేహాన్ని వెతికి తీశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు

