📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarమడిపల్లి గ్రామంలోబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మడిపల్లి గ్రామంలోబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

మడిపల్లి గ్రామంలోబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

* సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

* గ్రామ సర్పంచ్ తిరుమలవెంకటేష్  ఉపసర్పంచ్ కస్తూరి శ్రీనాథ్ వార్డు సభ్యులు

* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన

* బాలవికాస కోఆర్డినేటర్లు కె సుమలత ఏ స్వాతి ఆసియా

జమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)

జమ్మికుంట మండలం మడిపల్లి సైదాబాద్ గ్రామాల్లో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గ్రామపంచాయతీ ఆవరణల్లో ఉచిత వైద్య శిబిరాలునిర్వహించారుజమ్మికుంట ఆదిత్యఅమృత మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి హనుమకొండ శ్రీలక్ష్మీనరసింహ లూమినస్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో ఈ శిబిరాలు నిర్వహించారుఈ సందర్భంగా గ్రామ సర్పంచులు తిరుమలవెంకటేష్ పుప్పాల రాజారం మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని కోరారుఆరోగ్యమే మహాభాగ్యమనే భావనతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలనిసూచించారువైద్యులు డాక్టర్ శ్రీనివాస్ ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ గ్రీష్మ, డాక్టర్ తేజస్విని డాక్టర్ సంకీర్తన మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి కారణంగా మానసిక ఒత్తిడి పెరిగి గుండెపోటు మెదడు పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారుసమతుల్య ఆహారం తీసుకోవడం ప్రతిరోజూ నడక వ్యాయామం చేయడం తగినంత మంచినీరు తాగడం ద్వారాఆరోగ్యాన్నికాపాడుకోవచ్చని సూచించారు మహిళలు ఆరోగ్య విషయాల్లో మరింత అవగాహనతో ఉండాలని పిలుపునిచ్చారుఈ శిబిరాల్లో 220 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారుజమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నితీసుకోవాలనిసూచించారుబాలవికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14 సెంటర్ల పరిధిలోని 180 గ్రామాల్లో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ దాదాపు రూ.2 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారుఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్లు కె సుమలత ఏ స్వాతి ఆసియా ఉప సర్పంచులు కస్తూరి శ్రీనాథ్ ఉష్కేమల్ల తిరుపతి వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శులు అంజిరెడ్డి అంకుస్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పీఆర్‌వోలు రఫిక్ దుర్గాప్రసాద్ సంపత్ రెడ్డి రమేష్ భిక్షపతి రాజేష్ ఆస్పత్రి సిబ్బంది అనిల్ రావు శ్రావణ్ రంజిత్ పూజ సంతోషిని అనూష శృతి భారతి కృష్ణవేణి ప్రసన్నతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular