📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaకార్మికుల సమస్యల కోసం ఏఐటీయూసీ సమరశీల పోరాటాలు

కార్మికుల సమస్యల కోసం ఏఐటీయూసీ సమరశీల పోరాటాలు

📰 Generate e-Paper Clip

కార్మికుల సమస్యల కోసం ఏఐటీయూసీ సమరశీల పోరాటాలు

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు

 

ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా 2వ మహాసభలు

 

 

ప్రజావాణి, ఆగస్టు 05

హనుమకొండ: కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజిలేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు అన్నారు. బుధవారం హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో హనుమకొండ ఏఐటీయూసీ రెండవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైనా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన మహాసభకు వేల్పుల సారంగపాణి, నేదనూరి రాజమౌళి లు అధ్యక్షవర్గంగా వ్యవహరించగా ఎస్. బాలరాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం ఏఐటియుసి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ధనవంతులు చట్టం, మరింత ధనవంతులుగా పేదవారు మరింత పేదవారిగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక లోకం కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని అన్నారు. భారతదేశంలో 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. స్వాతంత్రానికి పూర్వమే కార్మిక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాధాల చట్టం, కనీస వేతన సాధించుకోవడం జరిగిందని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయుటకు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వతంత్ర సాధనే ధ్యేయంగా విరోచిత పోరాటాలు చేసిన గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల చేతుల్లో నలిగిపోయిన కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన అనేక ఉద్యమాల ద్వారా కార్మిక చట్టాలను హక్కులను సాధించిన ఏకైక సంఘం ఏఐటీయూసీ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల్ని బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. పని గంటల పెంచి కార్మికుల శ్రమ దోపిడికి పాల్పడే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు మారుస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల అవుతున్న నేటికీ రాష్ట్రంలో కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు మారలేదని, కనీస వేతనం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు రూ. 32000 వేల వేతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీ.ఎఫ్, ఈ.ఎస్.ఐ అమలు నోచుకోక శ్రమదోపిడికి గురవుతున్నారు. అదేవిదంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. ఉపాధి హామీ పథకం నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు. ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆదరి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్ముల రామ్మూర్తి, సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, ఆటో యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కర్రె లక్ష్మణ్, సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, ఇల్లందుల రాములు, గడ్డం లక్ష్మి, కే.మల్లయ్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నూర సంపత్ పటేల్, రసమల్ల దీనా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular