బెజ్జంకి, ఆగస్టు 6 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, ఆయన అందించిన సిద్ధాంత బలం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో లింగాల లక్ష్మణ్, తిరుపతి, రాజయ్య, శేఖర్ బాబు, బెజ్జంకి ఉపసర్పంచ్ మహేష్, దేవయ్య, రవి, నరేష్ పటేల్, వెంకటేష్, శివ, మహేష్, మల్లికార్జున్, అజయ్, బాల్ రెడ్డి, బాబు తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

