📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguపసర నాగారం గ్రామ పంచాయతీ తుది నోటీసు జారీ

పసర నాగారం గ్రామ పంచాయతీ తుది నోటీసు జారీ

📰 Generate e-Paper Clip


గోవిందరావుపేట/ ప్రజావాణి

గోవిందరావుపేట మండలం పసర నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం షాపింగ్ కాంప్లెక్స్ లోని రూం నెం. 13 కు సంబంధించి బకాయి కిరాయి చెల్లించాలని తుది నోటీసు జారీ చేసింది.
04/05/2026, 08/06/2026 తేదీల్లో ఇంతకు ముందు నోటీసులు ఇచ్చినా బకాయి చెల్లించలేదు.
ఈ నెల 08-2026 లోపు బకాయి కిరాయి చెల్లించకపోతే పంచాయతీ నిబంధనల ప్రకారం ఆ *షాపు/రూంను సీజ్* చేస్తామని తెలిపారు.
సంబంధిత షాపు అద్దెదారు వెంటనే పంచాయతీ కార్యాలయానికి వచ్చి బకాయిలు పూర్తిగా చెల్లించి తదుపరి చర్యలు నివారించాలని సూచించారు.
పంచాయతీ జారీ చేసిన నోటీసులను బేఖాతరు చేయడం నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీజ్ అనంతరం షాపులో ఉన్న వస్తువులకు పంచాయతీ బాధ్యత వహించదని, అద్దెతో పాటు వడ్డీ, జరిమానాలు కూడా వసూలు చేస్తామని పేర్కొన్నారు.
తేదీ 03-08-2026
జారీ చేసినవారు గ్రామ పంచాయతీ కార్యదర్శి, పసర నాగరం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular