📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeతెలంగాణYadadri Bhuvanagiriనూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం

నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం

📰 Generate e-Paper Clip

*నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం…*


*ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*


*జులై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు.*


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వలి గొండ మండలం వెంకటా పూర్ గ్రామంలో నూతనం గా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యా లయాలు గ్రామ పాలనకు కేంద్ర బిందువులుగా పని చేస్తాయని , ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను మరింత సులభంగా , వేగంగా, పారదర్శకంగా అందించడంలో నూతన కార్యాలయ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల అవసరాలకు అను గుణంగా అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవు తాయని , గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్య క్రమాల అమలు కూడా మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్య క్రమంలో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కర్నెకంటి కమలమ్మ–యాదయ్య , మండల ప్రజా ప్రతి నిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , వార్డు సభ్యులు , అధికారులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular