లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు 
చెన్నారావుపేట జూలై 29 ప్రజావాణి
మండల కేంద్రంలోని ధర్మతండా గ్రామపంచాయతీ సర్పంచ్ బోడో రవి నాయక్ తండ్రి లచ్చనాయక్ సంవత్సరిక కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ సర్పంచ్ అంగోతు అరుణ వీరసింగ్, పుల్లయ్యపోడు మాజీ సర్పంచ్ బోడ సమ్ము నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బాలు నాయక్ టీచర్, లింగమూర్తి, తన్వేస్ తదితరులు పాల్గొన్నారు.




