📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyబీర్కూర్  గురుస్వాములకు ఘన సన్మానం

బీర్కూర్  గురుస్వాములకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

బీర్కూర్ లో….
గురుస్వాములకు ఘన సన్మానం

బీర్కూర్ :

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ హనుమాన్ ఆలయంలో గురుపౌర్ణమి సందర్బంగా బుధవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వాములకు గ్రామ సర్పంచ్ అరిగె ధర్మతేజ, మండల యువ నాయకులు మియాపూర్ శశికాంత్ మరియు అయ్యప్ప మాల ధరించే శిష్యులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్బంగా గురు స్వాములు గుడికొండ లింగం, కొర్రి సుధాకర్ యాదవ్, గుడికొండ సుభాష్, కొర్రి అశోక్ యాదవ్, కొట్టూరి ప్రవీణ్ గుప్తా, కాదేపురం గంగన్న, ముత్యంగారి ప్రభాకర్ గౌడ్  లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా లింగం గురు స్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున సన్మానం పొందడం చాలా ఆనందంగా ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కందకుర్తి సంతోష్ గుప్తా, గన్నారం శివరాజ్, కొర్రి గంగాధర్ యాదవ్, మేకల నరేష్, బొగడమీది శ్యామ్, విఠల్ యాదవ్, పోతుల వెంకటేష్, కొర్రి శివ యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, మేకల రాజు, విఠల్ యాదవ్, దౌల్తాపురం  భీమప్ప, బాలకృష్ణ,  ఇరాస్ సాయిలు యాదవ్, కిష్టయ్య యాదవ్, సింగని విఠల్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular