📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakబీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులపై వివక్ష ఎందుకు?

బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులపై వివక్ష ఎందుకు?

📰 Generate e-Paper Clip



ఎనిమిది వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి.

మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి జూలై 29.

సమస్యలు పరిష్కరించకుంటే ప్రజల పక్షాన పోరాటం.

కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం సమర్పించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి.



మెదక్ పట్టణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది వార్డులపై వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై బుధవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజల చేత ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో కేవలం రాజకీయ కారణాలతో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ ఎనిమిది వార్డుల్లో పనులు చేయడం లేదని, అధికారులకు కూడా పనులు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో మెదక్ పట్టణంలోని అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది వార్డుల్లో మాత్రం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. టెండర్లు పూర్తయినప్పటికీ శిలాఫలకాలు ఏర్పాటు చేయడం లేదని, పనులను ప్రారంభించడం లేదని అన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఎనిమిది వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్,ఎమ్మెల్యేపై ఉందని పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి పనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో వీధి దీపాలు, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం వంటి పనులు అన్ని వార్డుల్లో చేపట్టాల్సి ఉన్నప్పటికీ, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని అన్నారు.టెండర్లు పూర్తయి రెండు, మూడు నెలలు గడుస్తున్నప్పటికీ శిలాఫలకాలు ఏర్పాటు చేయడం లేదని, పనులను ప్రారంభించడం లేదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పట్టణ అభివృద్ధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వార్డుల్లో నివసిస్తున్న ప్రజలు కూడా మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నారని, వారికి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందని గుర్తు చేశారు.
ఎనిమిది వార్డుల్లో వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులను సమానంగా చూసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
ఇతర కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్ స్వయంగా పర్యటించాలని డిమాండ్ చేశారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా తమ వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జుబెర్ అహ్మద్,ఖాజా సోహెల్ మైనుద్దీన్,బట్టి ఉదయ్‌కుమార్, దీపక్‌కుమార్,మాయ, గంగామణి,మల్లేశం,స్వరూప, ఫాతిమా ఇమ్దాద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular